కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఆగివున్న రైలును ఢీకొన్న ఎంఎంటీఎస్ రైల్..

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగిఉన్న కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును, ఎంఎంటీస్ రైలు ఢీకొట్టింది. కర్నూల్ ఇంటర్ సిటీ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో స్టేషన్ లో ఓ ట్రాక్ పై నిలిపిఉంచారు. ఫలక్‌నుమా నుంచి కాచిగూడకు బయల్దేరిన ఎంఎంటీఎస్ రైలు కూడా అదే ట్రాక్ పైకి రావడంతో నిలిపి ఉంచిన రైలును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఎంఎంటీఎస్ పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరో ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?