తల్లిదండ్రులే కొడుకును సజీవ దహనం చేశారు

జిల్లాలోని ఆత్మకూరు మండలం ముస్తాలపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని చేతులు కట్టేసి తల్లిదండ్రులే సజీవ దహనం చేశారు. ముస్తాలపల్లికి చెందిన మహేశ్ అనే వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నారు. నెల క్రితం భార్య అతన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో మహేష్ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దీంతో సొంత తల్లిదండ్రులే అతనిపై కిరోసిన్‌ పోసి తగలపెట్టారు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని స్థానికులు చెబుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?