తీస్ హజారీ సెగలు.. నిరసనకు దిగిన ఢిల్లీ పోలీసులు

ఈనెల 2న తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో ఘర్షణల నేపథ్యంలో దిగువ కోర్టుల లాయర్లు ఢిల్లీలో సోమవారం నిరసనలకు దిగడం, ఆ నిరసనల సమయంలో కొందరు లాయర్లు ఢిల్లీ పోలీసు సిబ్బందిపై దాడి జరిపినట్టు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం సంచలనమైంది. కాగా, శనివారంనాటి ఘటనలో పోలీసు సిబ్బందితో సహా సుమారు 30 మంది గాయపడ్డారు. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఇంత పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఆదివారంనాడు విచారణ చేపట్టి, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. సెప్షల్ కమిషనర్ (శాంతిభద్రతలు) సంజయ్ సింగ్‌‌ను సస్పెండ్ చేయడంతో పాటు పలువురు పోలీసు అధికారులకు చర్యలకు ఆదేశించింది. ఘర్షణల నేపథ్యంలో తీస్ హజారీ, కార్కర్‌డూమ జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి.

DO YOU LIKE THIS ARTICLE?