నిజమేనా: బీజేపీతో టచ్‌లో 25 మంది శివసేన ఎమ్మెల్యేలు..?

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో బేరసారాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మాటలకు బలం చేకూర్చేలా బద్నేరా నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి పోస్టుపై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదని శివసేన పార్టీ చెబుతోంది. ఎంతసేపు శివసేన పార్టీ పదవిపైనే మాట్లాడుతోంది కానీ తమ ఎమ్మెల్యేలు తమ చేతిలోనే ఉన్నారా లేక బీజేపీ వైపునకు చూస్తున్నారనా అనేదానిపై దృష్టి సారించడం మరిచినట్లు ఉంది. తాజాగా బద్నేరా ఎమ్మెల్యే రవిరాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌తో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. శివసేన బీజేపీతో కలిసి వెళ్లకుంటే ఆ పార్టీలో చీలికలు తథ్యమని జోస్యం చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?