రాజీవ్ గాంధీపై అసద్ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలోని వివాదాస్పద కట్టడం తాళాలు తెరిచింది రాజీవేనని.. అది చారిత్రక వాస్తవమని వ్యాఖ్యానించారు. హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గోడ్బోలే రాసిన పుస్తకం ఆ విషయాన్ని ధ్రువీకరిస్తుందని ఆయన అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రాజీవ్ గురించి మాధవ్ ఏం చెప్పారో అది అక్షర సత్యమన్నారు. బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?